అరటిపండు ఐస్‌క్రీమ్ తయారుచేయు విధానం
పాలు – 1 లీటర్
అరటిపండ్లు – 6
ఐస్‌క్రీమ్ పౌడర్ – 60 గ్రాములు
క్రీమ్ – 1/2 కిలో
పంచదార – 200 గ్రాములు
అరటిపండు ఐస్‌క్రీమ్ తయారీ విధానం
మొదట పాలను కాగబెటి, స్టౌమీద నుండి దించకుండా సిమ్‌లో పెట్టి మరగనివ్వాలి. ఒక కప్పు చల్లటి పాలలో ఐస్ క్రీమ్ పౌడర్‌ను ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పాలల్లో పొయ్యాలి. ఇందులోనే పంచదార, క్రీమ్, మిక్సీ పట్టిన అరటిపండ్ల గుజ్జు కలిపి మరి కొంతసేపు వేడి చేయాలి. ఈ పాల మిశ్రమం చిక్కబడిన తర్వాత చల్లార్చి ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డ కట్టిన తర్వాత తీసి మెత్తగా మిక్సీ వేయాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డ కట్టిన ఐస్‌క్రీమ్‌ని మళ్లీ మెత్తగా గ్రైండ్ చేయాలి. మెత్తగా నురగలు తేలుతున్న ఐస్‌క్రీమ్‌ను అరగంట ఫ్రిజ్‌లో పెట్టి తింటే రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment