Wednesday, 17 December 2014

ఎగ్ ఫ్రెడ్ రైస్ తయారు చేయు విధానం

ఎగ్ ఫ్రెడ్ రైస్ తయారు చేయు విధానం

  fried rice కావలసిన పదార్దాలు :
ఉడికించిన అన్నం – ఒక కప్పు
గుడ్లు – రెండు
క్యాబేజి ,క్యారెట్, బీన్స్ అన్ని కలిపి సగం ఉడికించిన ముక్కలు – అర కప్పు
పచ్చిమిర్చి- మూడు
కరివేపాకు – కొద్దిగా
ఉప్పు – సరిపడా
నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లి కాడలు – రెండు

తయారుచేయు విధానం :
1) స్టవ్ ఫై నెయ్యి లేదా డాల్డా వేడి చేసి కరిగిన తరువాత గుడ్లు కొట్టి వేసి బాగా కలపాలి.
2) తరువాత ఉడికించిన కూర కాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు వేయించాలి.
3) వేగిన తరువాత ఉడికించిన అన్నం, ఉప్పు వేసి కలపాలి.
4) ఒక గిన్నెలో వేసి ఫైన కట్ చేసిన ఉల్లి కాడలు ముక్కలు జల్లి సర్వ్ చెయ్యాలి.

No comments:

Post a Comment