Wednesday, 17 December 2014

రెస్టారెంట్ తరహాలో రుచికరమైన కడాయి పన్నీర్

రెస్టారెంట్ తరహాలో రుచికరమైన కడాయి పన్నీర్

  kadai-paneer కావలసిన పదార్థాలు
పనీర్ – 100 గ్రా
బటర్ – 30 గ్రా;
ఉల్లిపాయ పేస్ట్ – 100 గ్రా
జీడిపప్పు పేస్ట్ – 10 గ్రా;
టొమాటో పేస్ట్ – 50 గ్రా
నూనె – ఒక టీ స్పూను;
మిరప పొడి – ఒక టీ స్పూను;
కొత్తిమీర – కొద్దిగా
జీరాపొడి – అర టీ స్పూను
మెంతిపొడి – అర టీ స్పూను
పసుపు – అర టీ స్పూను
పంచదార – అర టీ స్పూను
రెడ్ ఫుడ్ కలర్ – రెండు చుక్కలు
ఉప్పు – తగినంత;
నీరు – తగిననంత
తయారు చేసే విధానం:


స్టౌ మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి వేడయ్యాక దానిలో పనీర్ వేసి వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. తరువాత అదే బాణలిలో బటర్ వేసి, బటర్ బాగా కాగాక ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ వే సి బాగా వేయించాలి. గోధుమరంగులోకి వచ్చే దాకా వేయించిన తరవాత అందులో మిరప్పొడి, జీరాపొడి, పసుపు, మెంతిపొడి, పంచదార, రెడ్‌కలర్ చుక్కలు, తగినంత ఉప్పు వేసి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోయాలి. వీటన్నిటినీ బాగా ఉడికేదాకా ఉంచాలి. అప్పుడు గ్రేవీలాగ వస్తుంది.
ఇప్పుడు ముందుగానే వేయించి ఉంచుకున్న పనీర్ ముక్కలను ఇందులో వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. కాసేపు కలిపాక కొంతసేపటికి దానిలోనుంచి నూనె పైకి తేలుతుంది. అప్పుడు స్టౌవ్ ఆపేసి తయారైన పనీర్ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడి గ సర్వ్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment